![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -42 లో..... తోట అమ్మిన రామారావు దగ్గరికి పోలీసులతో వెళ్తాను. మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి చాలు అని సింహాద్రితో జానూ అంటుంది. అవన్నీ ఎందుకు అమ్మ అని సింహాద్రి అంటాడు. అయిన వినకుండా జానూ వెళ్తుంది. సూర్యని కలిసి జానూ విషయం చెప్తుంది. జానూ, సూర్య ఇద్దరు కలిసి పోలీసులని తీసుకొని రామారావు ఇంటికి వెళ్తారు. అక్కడ ఇంటికి తాళం వేసి ఉంటుంది. అటుగా వెళ్తున్న అతన్ని వాళ్ళ గురించి అడుగగా తండ్రికొడుకులు కలిసి ఇప్పుడే తీర్థయాత్రలకి ఆటో ఎక్కి వెళ్లడం చూసానని అతను అనగానే తండ్రి ఏంటి అతను కోమాలో ఉన్నాడని అన్నారని జానూ అనగానే రామారావు కోమాలో ఉండడం ఏంటి ప్రొద్దునే వాకింగ్ లో కన్పించాడని అతను అనగానే జానూ షాక్ అవుతుంది.
ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇన్ఫా మ్ చెయ్యండి అని పోలీసులు వెళ్ళిపోతారు. ఇదంతా కావాలని చేస్తున్నట్లు అనిపిస్తుంది సింహాద్రి అంకుల్ కోమాలో ఉన్నాడని చెప్పాడు. అతను అలా చెప్తున్నాడని సూర్య, జానూ అనుకుంటారు. అదంతా సింహాద్రి దూరం నుంచి చూసి నవ్వుకుంటాడు.ఆ తర్వాత రామరావు కొడుకు సింహాద్రికి ఫోన్ చేస్తాడు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయిన ఇంటికి వస్తాము కదా.. అప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. మీరు వచ్చేసరికి వాళ్ళు ఊళ్ళో లేకుండా చేస్తానని అతనితో సింహాద్రితో చెప్తాడు. మరొకవైపు నందు ఫోన్ మాట్లాడుతుంటే శాంతి వెళ్లి ఫ్యాన్ అఫ్ చేస్తుంది. ఫ్యాన్ వేస్తే నీ సంగతి చెప్తానని కోప్పడుతుంది. మురళి వచ్చి తనకి టేబుల్ ఫ్యాన్ పెడుతాడు. మా అక్క అంటే ఎంత ఇష్టం బావ అని గౌతమి అంటుంది. చాలా ఇష్టమని మురళి అంటాడు. అప్పుడే చూసుకోకుండా నందు వస్తుంది. మురళి, నందు డాష్ ఇచ్చుకుంటారు. అలా తలలు తగిలితే పెళ్లి అవుతుందంట అని పెద్దావిడ అనగానే.. నువ్వు నోరు ముయ్ అలాంటి ఆశలు పెట్టుకోవద్దని నందు చెప్తుంది.
మరొకవైపు శారద వస్తుందని సింహాద్రి గోడకి శంకర్ ఫోటో పెట్టి బాధపడుతున్నట్లు యాక్టింగ్ చేస్తాడు. శారద లోపలికి వస్తుంది. నీకొక విషయం చెప్పాలని పిలిపించాను అమ్మ అని సింహాద్రి అంటాడు. మీరు మురళి వాళ్ళ ఇంట్లో బాగున్నారా లేక పక్క ఊరులో ఫామ్ హౌస్ ఉంది.. మీకు ఇబ్బంది అయితే అక్కడికి వెళ్ళండి అని సింహాద్రి అంటాడు. పర్వాలేదు బాగుంది అన్నయ్య అని శారద అంటుంది. ఆ తర్వాత పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్లి తోట ఇస్తాను.. పెళ్లి చేస్తానని వాళ్ళతో శపథం చేసి వచ్చింది జానూ.. వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నారు.. తోట ప్రాబ్లమ్ లో ఉంది.. ఇప్పుడు ఇవ్వన్ని ఎందుకు నువ్వే జానూ తో చెప్పమని అంటాడు. సరే అన్నయ్య నేను చెప్తానని శారద అంటుంది. ఆ తర్వాత తోట విషయం ఎక్కడ వరకు వచ్చిందని జానూని నందు అడుగుతుంది. ట్రై చేస్తున్నానని జానూ చెప్తుంది. తరువాయి భాగంలో రేపు శంకర్ నారాయణ ఇల్లు వేళంపాట జరుగుతుంది. కొనుకున్నే వాళ్ళు ఉంటే వేలం పాటకి రండీ అని ఊర్లో మైక్ లో చెప్తారు. అది విని ఇల్లు చేజారిపోతే మనం ఎప్పుడు సొంతం చేసుకోలేమని శారద ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |